దిల్ రాజుని ఛీ కొడుతున్న జనాలు..?

వేణు( Venu ) డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా( Balagam ) గురించి మనం ఇప్పుడు ప్రత్యేకం గా మాట్లాడుకునేది ఏం లేదు ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది.

అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు( Dil Raju ) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు .

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా లాభాలను ఆర్జించింది.

మరోవైపు నిర్మాతలకు మంచి సినిమా తీశారన్న గౌరవాన్ని తెచ్చిపెట్టింది.ఇదే విషయాన్ని దిల్ రాజు సైతం అనేక వేదికలపై ప్రస్తావించారు.

కానీ ఇప్పుడు మాత్రం గ్రామాల్లో ఫ్రీగా బలగం షోస్ ఉచితంగా """/" / ప్రదర్శించడం పట్ల ఆయన కేస్ ఫైల్ చేయడం పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు .

వాస్తవానికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలోని పాత్రల్లో తమను తాము చుసుకుంటున్నారు.

మనుషుల మధ్య మాయమైపోతున్న ఆప్యాయతలను తెరపై చూసుకుని కంటతడి పెడుతున్నారు.అయితే ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

దీంతో తెలంగాణలోని గ్రామాల్లో బలగం సినిమాను ఓపెన్‌ ప్రొజెక్టర్‌లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.చాటింపు వేసి మరీ షో ప్రదర్శన గురించి ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతం ఇదే విషయంపై దిల్ రాజు పోలీసులను ఆశ్రయించారు.ఇలా ఉచితంగా ప్రదర్శించడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొంతమంది తమ బలగం సినిమాను కాపీ కొట్టి ఓపెన్ స్క్రీన్స్‌లో ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దిల్ రాజు టీమ్ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

ఇలా ఫ్రీగా సినిమా చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"""/" /అయితే దిల్ రాజు ఫిర్యాదు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో ఈ మూవీ సక్సెస్ మీట్స్‌లో భాగంగా.

ఈ సినిమాను డబ్బు కోసం తీయలేదు.మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీశాను అని దిల్ రాజు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆయన్ని విమర్శిస్తున్నారు.

ఊరిలో ఉండే ప్రజలు ముసలి వాళ్ళు ఎలాగూ ఈ సినిమా ను ఓటిటి లో చూడరు కాబట్టి వాళ్ల కోసం ఈ సినిమా ను ఊరిలో ప్రొజెక్టర్ పెట్టీ వేస్తున్నారు.

దానికి దిల్ రాజు ఇలా కేస్ వేయడం చూసిన జనాలు ఆయన్ని తిట్టుకుంటూన్నారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి26, బుధవారం 2025