ప్రమాణం చేసి అబద్ధం చెబుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!
TeluguStop.com
కాలం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్న కొన్ని అలవాట్లు సాంప్రదాయాలు, ఆచారాలు అస్సలు మారవు.
అలా అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ మనల్ని వీడని అలవాట్లలో ఒకటి ఎవరైనా అబద్ధం ( Lies ) చెబుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఏది ఒట్టేసి చెప్పు అని అడుగుతూ ఉంటారు.
ఇప్పటికీ చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇలా ఒట్టు వేసి నిజం చెప్పమని అడుగుతూ ఉంటారు.
కొంతమంది ఒట్టు వేసి కూడా అబద్ధం చెబుతూ ఉంటారు.చాలా ప్రాంతాలలో ఇప్పటికీ ఇలాంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు.
సరదాగా అలా ఒట్టేస్తే పరవాలేదు.కానీ ఈ గుడిలో ( Temple ) మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు.
అలా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. """/" /
ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో కొలువు తీరిన వరసిద్ధి వినాయకుడిని( Varasiddhi Vinayaka ) కలియుగంలో కష్టాలు తీర్చే దైవంగా ఆరాధించే భక్తుడు ఎందరో ఉన్నారని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక చిన్న చిన్న విషయాలకు అబద్దాలు చెప్పే వ్యక్తులు కూడా కాణిపాకం వినాయకుని దేవాలయంలో( Kanipakam Vinayaka Temple ) అబద్ధం చెప్పాలంటే ఆలోచిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే ఆయన ముందు నిలుచొని ప్రమాణం చేసి అబద్ధం చెప్తే ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.
"""/" /
ఏముందిలే అని అబద్ధం చెప్పి కష్టాలను కొనితెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
మరికొందరు మేము ప్రత్యక్షంగా చూసాము.ఇలాంటి వాళ్ళని అని కూడా చెబుతున్నారు.
ఏదేమైనా ఈ దేవాలయంలో అబద్ధం చెప్పడానికి మాత్రం చాలా మంది ప్రజలు భయపడుతున్నారు.
కాబట్టి ప్రయాణం చేశాక ఈ గుడిలో అస్సలు అబద్దం చెప్పకూడదు.చెప్తే మాత్రం చాలా ప్రమాదకరమైన ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
అప్పుడు అన్నీ ఆత్మహత్య ఆలోచనలే.. దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్ వైరల్!