పెనుగంచిప్రోలు మండల జెడ్పిటిసి సభ్యురాలు వూట్ల నాగమణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
TeluguStop.com
చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు.స్నేహితులతో కలిసి పాడుకున్న పాటల కన్నా.
బాల్య స్మృతులు మన జీవితంలో ఏముంటాయి?అందుకే చిన్నప్పటి సరదాలను గుర్తు చేసుకున్నారు ఆ మహిళలు.
! కలిసిమెలసి ఆడుకునే ఆటల్లో మజాను.నేటితరం పిల్లలూ ఆస్వాదించాలంటూ అమ్మలే.
పిల్లలుగా మారారు.కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండల జెడ్పిటిసి సభ్యురాలు వూట్ల నాగమణి ఆధ్వర్యంలో మహిళా విభాగం మహిళా దినోత్సవాలు వినూత్నంగా సాగాయి.
రెండు రోజుల గా పెనుగంచిప్రోలు వసంత విహార్ గార్డెన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సతీమణి సామినేని విమల భాను పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా జబర్దస్త్ నటి ఐశ్వర్య ఆకర్షణగా నిలిచారు,మిస్ ఇండియాను, ఆట పాట డాన్స్ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
సభ్యులంతా ఒకచోట చేరి బాల్యంలో తాము ఆడిన ఆటలు ఆడుకున్నారు.కుర్చీలాట ఆట, కబాడీ, ఆట, ఇలా పలు రకాల ఆటలు ఆడారు.
చిన్ననాటి ఆటలేకాదు బాల్యంలో తాము బాగా ఆస్వాదించిన అపురూప గీతాలకు నృత్యాలు చేశారు.
చిన్నతనంలో తాము ఆ పాటలకు డాన్సులు వేయలేకపోయామని.ఇప్పుడు ఆ సరదా తీరిందంటూ సంబరపడ్డారు.
మన ఆచార వ్యవహారాలతో పాటు చిన్ననాటి ఆటపాటలనూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం ఇలా జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇంటిపని, వంట పని చేసుకోవడం వల్ల చాలా అలసిపోతున్నాం.వీటన్నింటికీ కొంచెం బ్రేక్ ఇచ్చి ఆటలు ఆడుకుంటున్నాం.
మాతోపాటు పిల్లలకు ఇలాంటి గేమ్స్ నేర్పించడం వల్ల చాలా సంతోషంగా ఉంది.పిల్లలు సెల్ఫోన్లకు అలవాటుపడిపోయారు.
దీనిని వినియోగించడానికి శారిరక శ్రమ అవసరం లేదు.కానీ గేమ్స్ ఆడటం వల్ల గెలుపోటములను సమానంగా తీసుకుంటారు.
చొక్కాలను చింపుకొని మరీ బాదుకున్న వ్యాపారస్తులు… దేనికోసం అంటే?