నెరవేరిన ట్రంప్ కల: మెక్సికో గోడ నిర్మాణానికి నిధుల బదిలీకి పెంటగాన్ ఆమోదం

మెక్సికో సరిహద్దుల్లో రక్షణ గోడను నిర్మించేందుకు గాను మిలటరీ నిధులను బదిలీ చేసేందుకు పెంటగాన్ ఆమోదముద్ర వేసింది.

11 గోడల నిర్మాణానికి గాను 3.6 బిలయన్ డాలర్ల మిలటరీ కన్‌స్ట్రక్షన్ నిధులను బదిలీ చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ నేతృత్వంలోని సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీస్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.జాతీయ భద్రత దృష్ట్యా.

మెక్సికో సరిహద్దుల్లో నిర్మించనున్న రక్షణ గోడ సహా మరో 11 గోడల నిర్మాణానికి సంబంధించి తాము సాయుధ బలగాలకు మద్ధతుగా నిలుస్తున్నామని.

ఇందుకోసం రూ.3.

6 బిలయన్ డాలర్ల నిధుల బదిలీకి ఆమోదం తెలుపుతున్నట్లు ఎస్పర్ కాంగ్రెస్‌‌కు తెలియజేశారు.

అయితే ఈ లేఖలో ఎక్కడా గోడ అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ.దేశ సరిహద్దు ప్రదేశాలలో కొత్త ఫెన్సింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులను ఎలా వినియోగించాలన్న దానిపై స్పష్టంగా తెలిపారు.

మరోవైపు 3.6 బిలియన్ డాలర్ల నిధులను మెక్సికో రక్షణ గోడ సహా 11 ప్రాజెక్ట్‌లకు మళ్లించేందుకు గాను సుమారు 127 మిలిటరీ ప్రాజెక్ట్‌లను రక్షణ శాఖ నిలిపివేసిందని కొందరు రక్షణ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/09/Pentagon-authorized-the-ertingof-3.6-billion-in-military-construction-funds!--jpg"/ గోడ నిర్మాణం 135 రోజుల్లో ప్రారంభంకానుంది.

ఇందుకోసం మెక్సికో సరిహద్దుల్లో ఫెడరల్ ప్రభుత్వం భూమిని సేకరించింది.ఇందులో ఆరిజోనా రాష్ట్రంలో రక్షణ శాఖకు చెందిన గోల్డ్ వాటర్ టెస్ట్ రేంజ్ కూడా ఉంది.

మొత్తం మీద సరిహద్దు గోడను నిర్మించేందుకు సైనిక నిధులను ఉపయోగించుకుంటామన్న ట్రంప్ మాటను పెంటగాన్ నేరవేర్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నాలుగేళ్లలోనే పోలీస్ అవతారం ఎత్తాడు.. కేసులు సాల్వ్ చేశాడు..?