50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు పింఛన్లు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: 50 సంవత్సరాలు దాటిన రజక వృత్తిదారులకు ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలని పట్టణ రజక సంఘం,లాండ్రి షాప్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ప్రజాభవన్లో జరిగిన రజక వృత్తిదారుల, లాండ్రీ షాపు అసోసియేషన్ సభ్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రజక వృత్తి చేసుకునేవారిని ఆదుకోవాలని,రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలో,సంక్షేమ వసతి గృహాల్లో రజక కులస్తులనే దోబీలుగా గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

గత ప్రభుత్వంలో మాదిరి రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు,రజక బంధు పథకం అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో లాండ్రీ షాప్ అసోసియేషన్ నాయకులు వడ్లాణపు శ్రీనివాసు,ఇందిరాల పిచ్చయ్య,దుగ్గి నర్శింహా, ఇందిరాల రాము,అలవాల మధు,వడ్లాణపు నరిసింహ,ఇందిరాల నరసింహ,తిరపయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆ కంటెస్టెంట్ కు బాగా నోటిదురుసు.. నయని పావని షాకింగ్ కామెంట్స్ వైరల్!