కాంగ్రెస్ సంచలన హామీ వర్కౌట్ అవుతుందా?

తెలంగాణ లో ఎట్టి పరిస్థితి లోనూ మళ్ళీ అదికారం సాదించాలని బలం గా కోరుకుంటున్న కాంగ్రెస్ ( Congress Party ) ఆ దిశగా బారీ హామీలు గుప్పిస్తుంది .

ఆ పార్టీ కీలక నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) 1300 కిలోమీటర్ల పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు ఘట్టం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఖమ్మం బహిరంగ ( Khammam ) సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఒక కీలకమైన హామీ ఇచ్చారు.వృద్ధులకు వితంతువులకు ₹4,000 నెలసరి పెన్షన్ అందిస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన హామీగానే చూడాలి .ఎందుకంటే కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి అక్కడ ఇచ్చిన పంచ -హామీలే ముఖ్య కారణం అన్న అంచనాలు ఉన్నాయి.

దాంతో తెలంగాణ ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ హామీలను నమ్ముకున్నట్లుగా తెలుస్తుంది. """/" / రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అయితే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో పెన్షన్ పెంచకుండా కేవలం తెలంగాణలో మాత్రమే హామీ ఇవ్వడం కాంగ్రెస్ దివాలా కోరుతనాన్ని బయటపేడుతుందని, ఎన్నికల జిమ్మిక్కుల కోసమే కాంగ్రెస్ ఇలాంటి హామీలు ఇస్తుందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అయితే తమకు అన్ని కోణాలలోనూ పాజిటివ్ వేవ్ కనిపిస్తున్నదని, వచ్చే ఎన్నికలలో అధికారాన్ని “హస్త”గతం చేసుకోవచ్చన్న బలమైన నమ్మకం కాంగ్రెస్లో కనిపిస్తుంది.

వచ్చే ఎన్నికలు తమకు భాజపా బీ టీం అయిన బారాసా కు మధ్య మాత్రమే ఉంటాయని రాహుల్ గాంధీ ప్రకటించారు.

బిజెపి తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగు అయిపోయిందని దాని గురించి మాట్లాడుకోవడం కూడా వృదా అంటూ ఆయన అభిప్రాయపడ్డారు .

"""/" / ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) కూడా ఈ సభ సందర్భంగా పార్టీలో జాయిన్ అయ్యారు.

వచ్చే ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఏది ఏమైనా తమకు గెలుపు రుచి చూపించిన కర్ణాటక ఫార్ములానే తెలంగాణ ఎన్నికలలో కూడా రిపీట్ చేయాలన్న ఉత్సాహం కాంగ్రెస్ హై కమాండ్ లో కనిపిస్తుంది.

ఆదిశగానే ప్రజలు నాకట్టుకునే హామీల రూపకల్పనకు నడుం బిగించినట్లుగా తెలుస్తుంది .మరి బారీ పెన్షన్ హామీ తెలంగాణ ప్రజానీకాన్ని ఈ మేరకు ఆకట్టుకుంటుందో కాంగ్రెస్ కు అది ఎంత ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాలి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లి పవర్‌స్టార్ కానున్న అకీరా..?