ఏపీలో పెన్షన్ కష్టాలు.. చంద్రబాబుకు బుద్ధి చెబుతామంటున్న ప్రజలు
TeluguStop.com
మొదటి తారీఖు వచ్చింది.కానీ పెన్షన్ మాత్రం రాలేదు.
వాలంటీర్లు రాలేదు.పింఛన్లు ఇవ్వలేదు.
ఇది ప్రస్తుతం ఏపీలో పింఛన్ దారుల పరిస్థితి.ప్రతి నెలా ఫస్ట్ తేదీ రాగానే ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చే వాలంటీర్లు ఈ నెల రాలేదు.
చేతికి పైసలు అందకపోవడంతో సరుకులు, మందులు కోనే పరిస్థితి లేక పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవేళ పెన్షన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయలట.దీంతో మండుటెండలో ఎలా వెళ్లాలోనని వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) చేసిన కుట్రల వలన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయడంపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే టీడీపికి అనుకూలంగా పని చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీకి ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది.
ఈసీ ఆదేశాల నేపథ్యంలో గత నెల పింఛన్ పంపిణీలో అవాంతరాలు ఏర్పడ్డాయి.సచివాలయాల వద్ద అధికారులు పెన్షన్ల పంపిణీ చేయగా.
వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే ఎండల తీవ్రతతో వడదెబ్బకు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.
"""/" /
దీంతో చంద్రబాబు వలనే తమకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఏపీలో పింఛన్ దారులు వాపోతున్నారు.
ఇప్పుడేమో బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడమంటే సాధ్యపడుతుందా? అని ఆలోచనలో పడ్డారు.బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లలో నిలబడి.
ఫారాలు నింపడం అనేది అవ్వాతాతలకు పెద్ద సమస్యని చెప్పుకోవచ్చు.దానికి తోడు బ్యాంకులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కొంత ఫెనాల్టీ విధిస్తాయి.
ఈ క్రమంలో పేదల ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండటం అనేది సందేహమే.వచ్చే మూడు వేల రూపాయల్లో మినిమమ్ బ్యాలెన్స్ పేరిట బ్యాంకు అధికారులు కోత విధిస్తే నష్టమని పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు.
"""/" /
చంద్రబాబు చేసిన కుట్ర వలనే తమకు ఇబ్బందులని తీవ్రంగా మండిపడుతున్నారు.
వాలంటీర్లు నిస్వార్థంగా ప్రతి ఇంటి గడప ముందుకు వచ్చి పెన్షన్లు అందించేవారని చెబుతున్నారు.
ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు మంచిపేరు వస్తుండటంతో ఓర్వలేకనే ఈ విధంగా విపక్షాలు చేస్తున్నాయని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
గతంలోనూ వైఎస్ జగన్ అందించే ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
పేదలకు మంచి జరుగుతుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు.
ఈ రెండు నెలల పాటు తమను ఇబ్బంది పెట్టినప్పటికీ వాలంటీర్లతో పాటు ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడతారని స్పష్టం చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ నియామకాన్ని సమర్ధించిన రో ఖన్నా .. శ్రీరామ్ కృష్ణన్‌కు మద్ధతు