ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదలవుతున్న పెన్ స్టూడియోస్ గంగూబాయి కథియావాడి

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

అంతేకాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని ప్రకటించారు.సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది.

‘బిగ్ అనౌన్స్‌‌మెంట్.సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.

అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు’ అని ప్రకటించారు.

ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్ నటించారు.సంజయ్ లీలా భన్సాలీ, డా.

జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.

అలియా భట్, అజయ్ దేవగణ్‌ల నుంచి సంజయ్ లీలా భన్సాలీ అద్భుతమైన నటన రాబట్టుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోన్నారు.

Chiranjeevi : చిరంజీవిని నా తమ్ముడిగా అస్సలు ఊహించుకోలేను.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!