పెందుర్తి నియోజకవర్గం విశాఖ జిల్లా లో ఉంచాలి.. అఖిలపక్షంలో తీర్మానం
TeluguStop.com
విశాఖ, పెందుర్తి: అనకాపల్లి వద్దు విశాఖ ముద్దు.పెందుర్తి నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉంచాలి.
ఉమ్మడి గా ఉందాం అంటూ అఖిలపక్షంలో తీర్మానం.శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని అఖిలపక్షంలో అన్ని పార్టీల నాయకులు తీర్మానం చేశారు.
వచ్చే నెల 6,7,8, తారీఖున నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి, 9 వ తారీఖున జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు.
అఖిలపక్ష సమావేశానికి అధికార పార్టీ వైకాపా, జనసేన, సిపిఎం గైర్హాజరు.పెందుర్తి నియోజకవర్గం లో ఉన్న అన్ని పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన వైఎస్ఆర్సిపి, జనసేన తప్ప మిగిలిన అన్ని పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్27, బుధవారం 2024