రెండు బైపాస్ లలో అవెన్యూ, విభాగిని ప్లాంటేషన్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి – కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో రెండు బైపాస్ లలో 15 కిలో మీటర్ల మేర అవెన్యూ, విభాగినీ ప్లాంటేషన్ పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

రెండో బై పాస్ లో ప్లాంటేషన్ పనులను జిల్లా కలెక్టర్ మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

చాలా వరకు ప్లాంటేషన్ పనులు పూర్తి అయినందున పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

రగుడు జంక్షన్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు ప్లాంటేషన్ , మానిటరింగ్ పనులను మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాల వేంకటపూర్ కూడలి వరకూ ప్లాంటేషన్, మానిటరింగ్ పనులను పంచాయితీ రాజ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.

అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలోని రెండు పడక గదుల ఇండ్ల వెనుక భాగంలో 20 ఎకరాలలో సిద్ధం చేస్తున్న మోడల్ లేఅవుట్ డెవలప్మెంట్ ను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వెంటనే భూమిని చదును చేసి ప్లాట్ లకు హద్దులను పెట్టాలన్నారు.బీటి రోడ్డు వేయాలన్నారు.

నెలాఖరులోగా యాక్షన్ కు పోయేలా మోడల్ లే అవుట్ ను సిద్ధం చేయాలన్నారు.

తర్వాత జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ పట్టణంలోని గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

పనులు ఆశించినంత వేగంగా జరగకపోవడం పై జిల్లా కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు షిఫ్ట్ లలో పనులను చేపట్టి నిర్దేశిత బతుకమ్మ పండుగ లోగా పనులను 100% పూర్తి చేయాలని ఆదేశించారు.

క్షేత్ర పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లు అయాజ్, అన్వేష్, వీటీడీఏ సెక్రెటరీ సమ్మయ్య , టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్,టూరిజం, డి ఈ ఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో వైరల్: పాకుతూ వచ్చిన ఏనుగు.. ఎందుకంటే..?