నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలకు జరిమానాలు విధింపు

కోనరావుపేట మండల పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో స్పెషల్ డ్రైవ్ నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలకు జరిమానాలు విధింపు ఏసీ కూలింగ్ బ్లాక్ పేపర్లను తొలగింపు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలి - ఎస్ ఐ రమాకాంత్ కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో మండలం లో స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్ ఐ రమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వెహికల్ కు నెంబర్ ప్లేట్ సరిగా ఉంచుకోవాలని, ప్రతీ ఒక్కరు విధిగా సరైన నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలనీ, వాహనదారుడు తప్పక హెల్మెట్ ధరించాలనీ అన్నారు.

కారులో ఏసీ కూలింగ్ కోసం బ్లాక్ కూలింగ్ పేపర్ వేస్తున్నారని, కూలింగ్ బ్లాక్ పేపర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అట్టి వాహనాలకు జరిమానా విధించటంతో పాటు బ్లాక్ పేపర్ ను ఎస్సై రమాకాంత్ తొలగించారు.

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నారా..?