మహేష్ బాబు చేతులు మీదుగా పెళ్లిసందD ట్రైలర్ రిలీజ్?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకీ దర్శకత్వంలో రోషన్, శ్రీ లీలా జంటగా రూపొందుతున్న తాజా చిత్రం పెళ్లి సంద D ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా పెళ్లిసందడి సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో నటించడం విశేషం.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇందులో రోషన్ ఎంతో అద్భుతంగా నటించాడనీ తెలుస్తోంది.

"""/"/ అదే విధంగా ఈ సినిమా ద్వారా దర్శకేంద్రుడు మొట్టమొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకే రోషన్ నాగార్జున నిర్మించినటువంటి నిర్మలా కాన్వెంట్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు.

ఆ తరువాత పెళ్లి సందD సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరి రోషన్ నటించిన పెళ్లి సందD" తన తండ్రి నటించిన పెళ్లి సందడి సినిమాను బీట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..