అర్ధరాత్రి వేళ వర్ష, ఇమ్మానుయేల్ కారులో షికార్లు.. పోలీస్ చేతికి చిక్కడంతో?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

ఇక ఈ షోలో సుడిగాలి సుధీర్, రష్మి జంట బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఈ జంట ఒకటి కావాలి అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈ జంటపై మల్లెమాల పలురకాల ఈవెంట్లను కూడా చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ జంట తరువాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న జంట వర్ష,  ఇమ్మాన్యుయేల్‌. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో లవ్ బర్డ్స్ గా ఇద్దరూ బాగా ఫేమస్ అయ్యారు.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు రకాల ఈవెంట్​లలో రొమాంటిక్ సాంగులకు స్టెప్పులు కూడా ఇరగదీశారు.

అంతేకాకుండా వీరిద్దరికీ పెళ్లి చేస్తూ ఒక ఈవెంట్ ను కూడా చేసిన విషయం తెలిసిందే.

వర్ష కూడా అప్పుడప్పుడు తనలో ఉన్న ప్రేమను బయట పెడుతూ ఉంటుంది.బయట ప్రేక్షకులు నిజంగానే ప్రేమించుకుంటున్నారని ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈటీవీ వారు ఈ ఏడాది చివరి రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే స్పెషల్ ప్రోగ్రామ్ ను చేశారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు.ఇందులో వర్ష,  ఇమ్మాన్యుయేల్‌ కారులో షికారు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్స్ లో హైలెట్ అయ్యారు.

"""/" / న్యూ ఇయర్ సెలబ్రేషన్ సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ప్రజల సేఫ్టీ పై దృష్టి పెడుతున్న  విషయాన్ని కాన్సెప్ట్ గా తీసుకుని ఒక స్కిట్ గా చేశారు కమెడియన్స్.

అయితే ఈ స్కిట్ ని స్టేజీపై కాకుండా నడిరోడ్డుపై చేశారు.నూకరాజు, పృథ్వి పోలీస్ గెటప్స్ వేసి ఉండగా.

ఇంతలో వర్ష, ఇమ్మాన్యుయేల్‌ కార్ లో చక్కర్లు కొడుతూ వాళ్లకు దొరికారు.లైసెన్స్ ఏది అని అడగడంతో ప్రేమించుకోవడానికి లైసెన్స్ కూడా కావాలా అని ప్రశ్నిస్తుంది.

అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్  చూడాలి అంటే ఈ ఏడాది చివరి రోజు వరకు వేచి చూడాల్సిందే.

1936లో రూ.2,700కే షెవర్లే కారు.. అప్పటి ధరలు వింటే దిమ్మతిరిగిపోతుంది..!