సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ‘పెద్ది’ మానియా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరో రామ్ చరణ్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్.

'మగధీర', 'ధృవ', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్'('Magadheera', 'Dhruva', 'Rangasthalam', 'RRR) వంటి విజయవంతమైన చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఆయన ప్రస్తుతం అభిమానులను మరింత ఆశ్చర్యపరచేలా సిద్ధమవుతున్నారు.

తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ సినిమాతో మరోసారి తెరపై మెరిపించబోతున్నారు.‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘పెద్ది’(Peddhi).

రామ్ చరణ్ (Ram Charan)కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేకమైన మూవీగా నిలవనుందని ఇండస్ట్రీలో బలమైన టాక్ ఉంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.రామ్ చరణ్ – జాన్వీ కపూర్(Ram Charan – Janhvi Kapoor) జోడీ వెండితెరపై చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రిద్ది సినిమాస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సంగీతం రంగంలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పనిచేస్తుండటం ఈ చిత్రానికి స్పెషల్ హైప్‌ను తీసుకువచ్చింది.

అలాగే జగపతిబాబు, శివన్న (శివరాజ్ కుమార్) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. """/" / ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియోపై స్పందన అమోఘంగా వస్తోంది.

ఆ వీడియోలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించగా, ప్రత్యేకంగా ఆయన బ్యాట్‌ను నేలపై కొట్టి బంతిని శక్తివంతంగా బాదిన స్టైల్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఆ ముమెంట్‌ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

"""/" / ఇప్పుడు ఈ షార్ట్ వీడియోకు సంబంధించి ట్రెండ్ పెరిగిపోయింది.“పెద్ది మానియా” అని చెప్పవచ్చు.

అభిమానులు, సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు రామ్ చరణ్ క్రికెట్ స్టైల్‌ను అనుకరిస్తూ రూపొందిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇదే చిత్రం మీద అంచనాలను మరింత పెంచేస్తోంది.రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

టాలెంటెడ్ టీమ్, అద్భుతమైన కాంబినేషన్లతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఎలాంటి ప్రయాణంలోకి తీసుకెళ్తుందో చూడాల్సిందే.

అప్పటివరకు “పెద్ది స్టైల్”‌ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

How Modern Technology Shapes The IGaming Experience