కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ ఇంటర్ లో 927 మార్కులు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ చదువుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

గత కొన్ని నెలలుగా కిడ్నీల సమస్యతో( Kidneys Problem ) బాధ పడుతున్న కూనరపు సిరి( Kunarapu Siri ) ఇప్పటివరకు ఎనిమిదిసార్లు డయాలసిస్ చేయించుకున్నారు.

ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సిరి మాత్రం కష్టపడి చదువుకుంటూ తన లక్ష్యాన్ని సాధించారు.

పెద్దపల్లి జిల్లా( Peddapally District ) గోదావరిఖనికి చెందిన కూనరపు సిరి సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

సిరి ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివి ఈ మార్కులు సాధించడం గమనార్హం.ఇంటర్ లో సీఈసీ గ్రూప్ ను ఎంచుకున్న సిరి కష్టపడి లక్ష్యాన్ని సాధించడం నెటిజన్లకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

సిరి తండ్రి సెంట్రింగ్ పని చేస్తున్నారు.ఆరోగ్య సమస్యలు ఉన్నా చదవాలనే కసి ఆమెలో తగ్గలేదు.

"""/" / నెలకు రెండుసార్లు డయాలసిస్ చేయించడం వల్ల ఆమెకు ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) సైతం ఎదురయ్యాయని సమాచారం అందుతోంది.

ఆమె మంచి మార్కులు సాధించడంలో లెక్చరర్లు సైతం తమ వంతు సహాయసహకారాలు అందించారని సమాచారం అందుతోంది.

సిరి కాలేజ్ టాపర్ గా నిలవడంతో లెక్చరర్లు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వం ఆదుకోవాలని తమ కూతురికి చికిత్స చేయించాలని సిరి తల్లీదండ్రులు కోరుకుంటున్నారు. """/" / కూనరపు సిరి ఆరోగ్య సమస్యలు పరిష్కారమైతే మాత్రం ఆమె మరింత బాగా చదువుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కూనరపు సిరి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతుండటం గమనార్హం.

తెలంగాణ సర్కార్ ఈ విద్యార్థినికి ఆర్థికంగా సహాయం చేస్తుందేమో చూడాల్సి ఉంది.కిడ్నీ సమస్యల నుంచి ఆమె కోలుకోవాలని నెటిజన్లు సైతం ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు.

కూనరపు సిరి ఎన్ని ఆవాంతరాలు ఎదురైనా కెరీర్ పరంగా వెనుకడుగు మాత్రం వేయలేదు.

ఈ వరల్డ్ లోనే బెస్ట్ దేశం అది.. మన దేశం ఏ స్థాయిలో ఉందంటే?