పైరవీకారులపై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సీరియస్

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.డబ్బులు ఇస్తే దళితబంధు పథకం ఇప్పిస్తామనే పైరవీకారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ విధంగా ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులు అడిగిన వారిని కొట్టడానికి చేతకాలేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే దాసరి.

దళితబంధు పథకం కోసం అడిగితే కొందరు డబ్బులు అడుగుతున్నారన్న విషయాలన్ని స్థానికులు ఎమ్మెల్యే దాసరి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన ఆయన ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అర్హులైన వారందరికీ దళితబంధు, బీసీ బంధు వస్తుందని తెలిపారు.ఈసారి ఎవరైనా డబ్బులు అడిగితే ఉపేక్షించకుండా చెప్పుతో కొట్టండంటూ ధ్వజమెత్తారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న ఇద్దరు బాలీవుడ్ హీరోలు…