జాతీయ పక్షికి అరుదైన గౌరవం.. ఘనంగా అంతిమయాత్ర..?

జాతీయ పక్షికి అరుదైన గౌరవం ఘనంగా అంతిమయాత్ర?

ఈ మధ్యకాలంలో మనుషులకు విలువ లేకుండా పోతుంది.ఒక మనిషి చనిపోతే కనీసం అంతిమ సంస్కారాలు కూడా సరిగా జరగడం లేదు.

జాతీయ పక్షికి అరుదైన గౌరవం ఘనంగా అంతిమయాత్ర?

ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనిషిలో మానవత్వం మంటగలిసి పోతుంది అన్నది అర్ధమవుతుంది.మనుషులకు విలువ లేని ఈ రోజుల్లో ఏకంగా మనుషులతో పాటు మూగ జీవాలు పక్షులు జంతువుల కు విలువ నిచ్చే వారిని చూస్తే సెల్యూట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది.

జాతీయ పక్షికి అరుదైన గౌరవం ఘనంగా అంతిమయాత్ర?

ఇక్కడ తాజాగా ఇలాంటి పని చేశారు అధికారులు .భారత జాతీయ పక్షి కి అరుదైన గౌరవం ఇచ్చారు.

మామూలుగా రోడ్డుపైన వెళ్తుంటే జాతీయ పక్షి నెమలి చనిపోయినట్లు కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు.

వారి దారిన వారు వెళుతూ ఉంటారు.ఇక్కడ మాత్రం కొంతమంది ఏకంగా నెమలికి అంతిమ యాత్ర నిర్వహించి నెమలిని గౌరవించారు.

రాజస్థాన్లోని భరత్ పూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన విద్యుత్ షాక్ తగలడంతో జాతీయ పక్షి నెమలి ప్రాణాలు కోల్పోయింది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక చనిపోయిన నెమలికి పోస్టుమార్టం నిర్వహించారు.

ఆ తర్వాత నెమలికి ఘనంగా అంత్యక్రియలు చేపట్టారు అటవీశాఖ అధికారులు.జాతీయ పక్షి కి ఎంతో గౌరవం ఇచ్చి ఘనంగ అంతిమయాత్ర చేపట్టగా ఈ ఊరేగింపులో స్థానికులతో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.

అంతేకాదు మృతిచెందిన నెమలి యొక్క అంతిమ యాత్రలో నెమలి పాడెను కూడా అధికారులు మోశారు.

అయితే ఒక నెమలి కి ఇంత గౌరవం ఇచ్చి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించిన అటవీశాఖ అధికారులపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.

నానికి స్పెషల్ గిఫ్ట్ పంపిన చిరు… అవార్డుతో సమానం… చిరు సినిమా పై నాని కామెంట్స్!