అక్రమ అరెస్టులను ఖండించండి: పి.డి.ఎస్. యు జిల్లా కమిటీ

సూర్యాపేట జిల్లా: మనిషిని మనిషిగా చూడని మనుస్మృతి సంస్కృతి వ్యతిరేకంగా భారత రాజ్యాగంలో ప్రజలకు కల్పించిన స్వేచ్చ అంశాలపై భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి మీటింగ్ ను ఆదివారం స్వేచ్చ జేఏసీ ఆధ్వర్యంలో ఏజీ భవన్లో సమావేశం అనంతరం అంబేద్కర్ ను ఆ రోజుల్లో తాను బ్రతికుంటే గాంధీని కాల్చిన గాడ్సే లాగా చంపే వాడినని హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేయడానికి శాంతియుత వెళుతున్న స్వేచ్ఛా జేఏసీ నేతలైన ప్రముఖ రచయత సతీష్ చందర్, కవి జయరాజు, అంబేడ్కరిస్ట్ జీలకర్ర శ్రీనివాస్,పివోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ,కొల జనార్థన్,పులి కల్పన, పి.

డి.ఎస్.

యు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ లతో పాటు 50 మంది నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పి.

డి.ఎస్.

యు.సూర్యాపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పి.

డి.ఎస్.

యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ తెలిపారు.ఆదివారంజిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మనువాద ఫాసిస్ట్ రాజ్యాంగంగా మార్చే కుట్రలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామన్నారు.

నూతన సెక్రటేరియట్ కి అంబేద్కర్ పేరు పెట్టుతున్నాం,ట్యాంక్ బండ్ పక్కన నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం కడుతున్నాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం హమారా ప్రసాద్ వ్యాఖ్యలకు కనీసం నిరసన తెలుపకుండా అడ్డుకోవడం శోచనీయమన్నారు.

తక్షణమే అరెస్ట్ చేసిన ప్రజాసంఘాల, జేఏసీ నాయకులను విడుదలని చేయలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పి.డి.

ఎస్.యు.

డివిజన్ అధ్యక్షకార్యదర్శులు జలగం సుమంత్, పిడమర్తి భరత్,డివిజన్ ఉపాధ్యక్షులు బట్టిపల్లి మహేష్,చిత్తలూరి గోపి తదితరులు పాల్గొన్నారు.

తండ్రి రైతు.. నాలుగు ఉద్యోగాలు సాధించిన కొడుకు.. సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!