ఈ సూపర్ ఫుడ్స్ తో పిసిఓఎస్ సమస్య దూరం..

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నవయసులోనే ఎన్నో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు.అదేవిధంగా ఒత్తిడి, డయాబెటిస్, గుండె జబ్బులు కూడా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి.

అంతేకాకుండా చాలా మంది అమ్మాయిలకు ఏదో ఒక స్త్రీ జననేంద్రియ సమస్యలు వస్తూనే ఉన్నాయి.

ఈ జాబితాలో పిసిఓఎస్(PCOS) అగ్రస్థానంలో ఉంది.పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పిసిఓఎస్ అనేది హార్మోన్ల రుగ్మత.

క్రమం తప్పకుండా పీరియడ్స్ రావడం, ముఖంపై రోమాలు ఎక్కువగా రావడం, బరువు పెరగడం, మొటిమలు లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.

"""/" / అయితే పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్(Polycystic Ovary Syndrome) ఉండడం వల్ల వంధ్యత్వం, మధుమేహం, గుండె జబ్బులు(Diabetes And Heart Disease) వచ్చే ప్రమాదం ఉంది.

అయితే ఈ వ్యాధి మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం పై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది అని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

అందుకే ఈ వ్యాధిని నియంత్రించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి.అందుకే సూపర్ ఫుడ్స్ తో పిసిఓఏస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కువ కార్బోహైడ్రేట్ లు తినడం మానేస్తే మంచిది.

ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. """/" / అందుకే ఓట్స్, మిల్లెట్, బ్రౌన్ రైస్, ఆపిల్స్, బేరి లాంటి వాటిని తినాలి.

పిసిఓఏస్ సమస్యతో బాధపడేవారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది.దానికి బదులుగా సోయా పాలు, ఓట్స్ పాలు, బాదంపాలు(Soy Milk, Oat Milk, Almond Milk) లాంటివి తీసుకోవచ్చు.

అవి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.అలాగే చక్కెర జోడించిన, ప్యాక్ చేసిన పాలను కూడా అస్సలు తీసుకోకూడదు.

అదేవిధంగా చక్కెర పానీయాలను కూడా పూర్తిగా మానేయాలి.శీతల పానీయాలు లేదా ఏదైనా చక్కెర పానీయాల జోలికి అస్సలు వెళ్ళకూడదు.

ఎందుకంటే చక్కెర పానీయాలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

లడ్డూ ప్రసాదం పై నేడు సుప్రీం తీర్పు .. సిట్టా స్వతంత్ర దర్యాప్తా ?