కారులో వాటితో మాట్లాడుతున్న పాయల్ రాజ్ పుత్.. వైరల్ పిక్?

కొన్ని కొన్ని సార్లు నటీనటులు తమకు ఏమీ తోచక కొన్ని పనులు చేస్తూ ఉంటారు.

ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టడం కానీ, రీల్స్ చూడటం కానీ, రీల్స్ చేయటం కానీ చేస్తూ ఉంటారు.

ఇక కొంతమంది మాత్రం పక్కన వారితో మాట్లాడటం లేదా తమ పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం చేస్తుంటారు.

కానీ ఇక్కడ పాయల్ రాజ్ పుత్ కాస్త డిఫరెంట్ గా కనిపించింది.బహుశా ఖాళీ సమయం దొరికింది ఏమో కానీ ఆమె ఎవరితో మాట్లాడిందో చూస్తే మాత్రం షాక్ అవుతారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

కానీ ఆ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.తొలిసారిగా పంజాబీ సినిమాతో పరిచయమైంది పాయల్.

ఇక తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు బాగా వచ్చి పడుతున్నాయి.తెలుగు భాషలోనే కాకుండా తన భాషలో కూడా బిజీగా మారింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.వ్యక్తిగతంగా కూడా ఈ ముద్దుగుమ్మ గతంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

"""/"/ అదేంటంటే ఆమె తన చిన్ననాటి ఫ్రెండ్ సౌరబ్ డింగ్రా  అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.

ఈ విషయాన్ని తానే ఓసారి తెలిపి షాక్ ఇచ్చింది.ఇక అతనితో సహజీవనం చేయడమే కాకుండా అతనితో దిగిన ఫోటోలను నేరుగా పంచుకుంటుంది.

ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగుడుతుంది.

కొన్ని సందర్భాలలో ఇంట్రెస్టింగ్ విషయాలు బాగా షేర్ చేసుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

అయితే అందులో తను కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించగా ఆ సమయంలో తన చేతిలో ఉన్న గులాబీ పువ్వులను ఫోటో దించింది.

అంతేకాకుండా వాటితో మాట్లాడుతున్నాను అన్నట్లుగా తెలిపింది.దీంతో ఆ పోస్ట్ వైరల్ అవ్వగా.

నువ్వు వాటితో కూడా మాట్లాడతావా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. """/"/ ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్లాఫ్ అయ్యింది.

ఇక ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.

త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి సక్సెస్ కాలేకపోయినా కూడా దర్శక నిర్మాతలు ఈ అమ్మడి కోసం బాగానే లైన్ కడుతున్నారు.

ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చూసేవాళ్లకు శుభవార్త.. ఆ సీన్లను యాడ్ చేయనున్నారా?