కిడ్నీ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!

ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోయిన్స్ లో అందం తో పాటు అద్భుతమైన అభినయం ని కనబర్చిన హీరోయిన్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్.

( Payal Rajput ) సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్ విలన్ రోల్స్ లో నటించడానికి బయపడుతారు.

ఎందుకంటే ఆడియన్స్ లో ఒక్కసారి నెగటివ్ రోల్ తో వాల్ల మైండ్ లోకి వెళ్ళిపోతే అదే దృష్టిలో చూస్తారు అనే అభద్రతా భావం కలుగుతుంది.

కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం తొలి సినిమా ఆర్ ఎక్స్ 100 లోనే( RX 100 ) నెగటివ్ రోల్ తో అదరగొట్టింది.

ఈ సినిమా తర్వాత అందరూ హీరోయిన్స్ భయపడినట్టుగానే, పాయల్ రాజ్ పుత్ మీద కూడా ఆడియన్స్ లో ఆ మార్క్ అలా పడిపోయింది.

ఆ సినిమా తర్వాత ఆమెకి ఎక్కువగా అలాంటి తరహా పాత్రలే వచ్చాయి.కానీ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి.

"""/" / ఇప్పుడు ఆమె రీసెంట్ గా తన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తో 'మంగళవారం'( Mangalavaram Movie ) అనే చిత్రం చేసింది.

రీసెంట్ గానే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

పాయల్ రాజ్ పుత్ కి కెరీర్ లో మరో అద్భుతమైన రోల్ దొరికింది అని ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది.

త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది పాయల్ రాజ్ పుత్.

అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ నాకు మంచి నీళ్లు తక్కువగా త్రాగే అలవాటు ఉంది, అందువల్ల నాకు కిడ్నీ సమస్యలు( Kidney Problems ) తలెత్తాయి.

చాలా అవస్థలు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. """/" / ఇంకా ఆమె మాట్లాడుతూ మీరు కూడా నాలాగా చెయ్యకండి, మంచి నీళ్లు( Water ) బాగా త్రాగండి, మన శరీరాన్ని డీ హైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అంటూ పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ఆమె తన తొలిప్రేమ గురించి కూడా ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించానని, అతన్ని చూస్తే నా మనసుకి ఆనందం మామూలుగా ఉండేది కాదని, ఒకరోజు ధైర్యం చేసుకొని అతనికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసాడని, దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను అని, చదువు మీద శ్రద్ద చూపలేకపోయాను అని, ప్రతీ రోజు ఈ విషయం ని తలచుకొని ఏడ్చేదానిని అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీలో ఆ మలయాళ నటుడు.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వేరే లెవెల్!