అతనితో లవ్ లో పడ్డ పాయల్.. ఫోటో వైరల్..!

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

వెంకీ మామ, డిస్కో రాజా సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించిన పాయల్ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం పాయల్ అనగనగా ఓ అతిథి సినిమాలో నటిస్తున్నారు.నిన్న పాయల్ పుట్టినరోజు కాగా బర్త్ డే సందర్భంగా పాయల్ సోషల్ మీడియా వేదికగా తన లవర్ ను పరిచయం చేశారు.

గత కొన్నిరోజులుగా పాయల్ ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ పాయల్ సౌరబ్ దింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు.

సౌరబ్ దింగ్రా హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ పాయల్ ఫోటోను షేర్ చేయగా పాయల్ ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేసింది.

"""/"/ లవ్ కన్ఫామ్ చేయడంతో నెటిజన్లు పాయల్ కు ఆల్ ది బెస్ట్ చెతున్నారు.

గతంలో సౌరభ్ పుట్టినరోజుకు పాయల్ చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తన తప్పొప్పులు మన్నించి ప్రేమించే ఏకైక వ్యక్తి సౌరభ్ అని.సౌరభ్ కంటే ఎక్కువగా తన తప్పొప్పులను ఎవరూ మన్నించలేదని.

సౌరభ్ ఇచ్చిన సంతోషం, ప్రశాంతత తనకు ఎవ్వరూ ఇవ్వలేదని.హ్యాపీ బర్త్ డే మేరీ జాన్ అంటూ పాయల్ ట్వీట్ చేసింది.

మరోవైపు ఆర్ఎక్స్ 100 మినహా పాయల్ కు కెరీర్ లో సరైన హిట్లు లేవు.

అయితే గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, బోల్డ్ పాత్రల్లో నటించడానికి కూడా అంగీకరిస్తూ ఉండటంతో పాయల్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా తనకు అభ్యంతరం లేదని పాయల్ చెబుతుండటం గమనార్హం.

ఆ ఇద్దరమ్మాయిలు ప్రేమించి మోసం చేశారు.. షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!