హీరోయిన్స్ వాటిని ప్రమోట్ చేస్తే తప్పేంటి.. పాయల్ రాజ్ పుత్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.

ఇక తన అందంతో మాత్రం బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తన పోస్టులతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.

తొలిసారి పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

పైగా అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతుంది.పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.

కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

"""/" / అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.

అతనితో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

అంతే కాకుండా గతంలో ఇద్దరు ఒకే రూములో ఉంటూ దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది పాయల్.

ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్స్ పై వచ్చే విమర్శల గురించి స్పందించింది.గతంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఓ లిక్కర్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.

దీంతో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్లు ఆమెను నానారకాలుగా విమర్శలు చేశారు.

"""/" / దీంతో ఈ విషయం గురించి తాజాగా పాయల్ రాజ్ పుత్ స్పందించింది.

లిక్కర్ బ్రాండ్ ను పురుషులు ప్రమోట్ చేస్తే ఎవరు వాదించరని అన్నది.లింగభేదం చూపించకూడదని అంటూ.

మహిళలు ఆటవిడుపు కోసం మద్యాన్ని సేవిస్తారని తెలిపింది.అందువల్ల హీరోయిన్స్ లిక్కర్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.

ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన మీనా.. ఆ వార్తలు ఎంతో హర్ట్ చేశాయా?