వాళ్ల చేతిలో మోసపోయిన పాయల్ రాజ్ పుత్..!

బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్ ని తీసుకొచ్చి ఆరెక్స్ 100 సినిమా తీశాడు డైరక్టర్ అజయ్ భూపతి.

కార్తికేయతో పాయల్ రాజ్ పుత్ చేసిన రొమాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఈ క్రమంలో ఆ సినిమాతో అమ్మడి టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది.

అయితే తను పరిశ్రమకి కొత్త అవడం వల్ల కొందరి చేతుల్లో మోసపోయినట్టు ఇటీవల ఇంటర్వ్యూలో వెళ్లడించింది పాయల్ రాజ్ పుత్.

ఆమె తన మేనేజర్ లని నమ్మి మోసపోయినట్టు తెలుస్తుంది.తన ప్రమేయం లేకుండానే కొన్ని సినిమాలకు వాళ్లు అడ్వాన్స్ తీసుకున్నారని.

సినిమా కథ విషయంలో తన నిర్ణయానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదని అన్నారు.అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా తనని వాళ్లు చాలా దారుణంగా మోసం చేశారని చెప్పుకొచ్చింది.

మొత్తం ముగ్గురు మేనేజర్లు తనని ఇబ్బంది పెట్టారని చెప్పారు పాయల్ రాజ్ పుత్.

అయితే వాళ్లని తీసేశాక ఇప్పుడు తన సినిమాల ఎంపిక చాలా బాగుందని చెప్పుకొచ్చారు.

 ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు హీరోగా చేస్తున్న జిన్నా సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాని సూర్య డైరెక్ట్ చేస్తున్నారు.