ఆ ఒక్క నిర్ణయంతోనే ఐదేళ్లుగా సక్సెస్ లేదు… పాయల్ కామెంట్స్ వైరల్
TeluguStop.com
పంజాబీ సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
అయితే ఈమె తెలుగు ప్రేక్షకులకు ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా అజయ్ భూపతి ( Ajay Bhupathi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈమెకు ఎంతో మంచి సక్సెస్ అందించింది.
ఈ సినిమా తర్వాత పాయల్ పలు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించారు.
అయితే ఏమాత్రం ఈమెకు పేరు ప్రఖ్యాతలు తీసుకురాలేకపోయాయి. """/" /
ఆర్ఎక్స్ 100 సినిమా వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది.
ఈ సినిమా స్థాయిలో ఏ సినిమా కూడా హిట్ అందుకోలేక పోయిందని చెప్పాలి.
అయితే తనకు మొదటి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి మరోసారి ఈమె మంగళవారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా నవంబర్ 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు.
"""/" /
ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ తనకు ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయానని తెలిపారు.
అయితే ఇలా ఐదు సంవత్సరాలుగా తాను ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా కూడా అందుకోకపోవడానికి కారణం కూడా ఉందని ఈమె తెలియజేశారు.
తన మొదటి సినిమాలో ఈమె నెగిటివ్ పాత్ర( Negative Role ) లో నటించారు.
ఇలా మొదటి సినిమాకే ఇలాంటి పాత్రలో నటించిన తాను ఇతర సినిమాలలో నటించిన ఆ పాత్రలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇలా ఆ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించడం వల్ల తనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయాయని అయితే మంగళవారం సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్ఎక్స్ 100 ద్వారా హిట్ ఇచ్చిన అజయ్ భూపతి మంగళవారం ద్వారా కూడా ఈమెకు హిట్ అందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
అమెరికా వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన గౌతమ్.. అసలేం జరిగిందంటే?