బాలయ్య సినిమాలో తారక్ బ్యూటీ.. అందుకేనా?

‘‘ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసి బాధపడుతున్నా.రాజమౌళి గారు దయచేసి ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయండి’’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాయల్ ఘోష్ అనే హీరోయిన్ నవ్వులపాలైంది.

అయితే ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భజన చేస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

కాగా పాయల్ ఘోష్ అంటే తెలుగు ప్రక్షకులు ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు.కానీ ప్రయాణం సినిమా హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది ఈ బ్యూటీ.

ఆ తరువాత జూ.ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ, మళ్లీ తెలుగులో కనిపించలేదు.

టాలీవుడ్‌లో సక్సెస్ సాధించలేకపోయిన ఈ బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.అయితే అక్కడ కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

దీంతో ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఈ బ్యూటీ ప్రయత్నిస్తోంది.నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ ఘోష్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర వర్గాల్లో తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్‌ను చిత్ర యూనిట్ పరిచయం చేస్తున్నారు.

మరి ఈ సినిమాతో పాయల్ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి.

స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!