నేను కూడా మెంటల్ డిప్రెషన్ తో బాధ పడుతున్నానంటున్న పాయల్…
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి "ఊసరవెల్లి" చిత్రం లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నటించినటువంటి బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ గురించి తెలియనివారుండరు.
అయితే ఈ అమ్మడు తాజాగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ ట్వీట్ లో పాయల్ ఘోష్ గత కొద్ది కాలంగా మానసిక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని ఇందులో ఎక్కువగా మెంటల్ డిప్రేషన్ కి అప్పుడప్పుడు గురవుతుంటానని అందువల్లే ఇప్పటికీ వైద్యులు సూచించినటువంటి మందులను వాడుతూ ఉంటానని తెలిపింది.
అలాగే ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడి మరియు మెంటల్ టెన్షన్లకు గురైనప్పుడు వెంటనే తన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడుతుంటానని చెప్పుకొచ్చింది.
దీంతో కొందరు అభిమానులు పాయల్ ఘోష్ మెంటల్ డిప్రెషన్ గురించి చేసినటువంటి ట్వీట్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు.
అంతేకాక జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొ సమస్య ఉంటుందని అలాగని అన్ని సమస్యలకి ఆత్మహత్య శరణ్యం కాదని ప్రతి ప్రశ్నకి సమాధానం కచ్చితంగా ఉంటుందని కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడులకు లోను కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కచ్చితంగా సమస్యను అధిగమించవచ్చని ధైర్యం చెబుతున్నారు.
అయితే తెలుగులో పాయల్ ఘోష్ ప్రయాణం, ఊసరవెల్లి అనేక చిత్రాలలో నటించింది.కానీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?