పవన్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితం..: పోతిన మహేశ్

జనసేన పార్టీకి, పదవికి రాజీనామా చేసిన పోతిన మహేశ్( Pothina Mahesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని తెలిపారు.

స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఆయన ఏనాడు దృష్టి సారించలేదని మండిపడ్డారు.పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితమని పేర్కొన్నారు.

కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్( Vijayawada West Ticket ) దక్కకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ తీరుపై పోతిన మహేశ్ అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నియోజకవర్గ టికెట్ ను తనకే కేటాయించాలని కోరుతూ మద్ధతుదారులతో కలిసి దీక్షా కార్యక్రమం కూడా నిర్వహించారు.

కశ్మీర్‌లో గింగిరాలు తిరిగిన కారు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..