పవన్ ఇలా చెప్పారా ? చాలా ఉందిగా ? 

ఏదైతేనేం జనసేన పార్టీలోనూ ఊపు కనిపిస్తోంది.అధికారం దక్కించుకోగలము అనే ధీమా పెరిగినట్టుగానే ఉంది.

అందుకే  ఉత్సాహంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఊహించని విధంగా పర్యటనలు చేపడుతున్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.అంతే కాకుండా పెద్ద ఎత్తున జనసేన లో చేరికలు ఉండేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ వ్యూహం ప్రకారమే జనసేన లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన చాలామంది నాయకులే ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా టిడిపి ,బిజెపి ,కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ చేరికలు ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.

దీనికి తోడు 2024 ఎన్నికల నాటికి టిడిపి జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారంతో చాలామంది నాయకులు జనసేనలోకి క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు.

రెండు పార్టీలు కలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాయని, అప్పుడు తమకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే లెక్కల్లో చాలామంది నాయకులు ఉన్నారు.

అయితే అలా వచ్చిన నేతలను చేర్చుకునేందుకు పవన్ ఇష్టపడటం లేదట.ఇటీవలే పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

తనతో 20 ఏళ్ళ పాటు ప్రయాణం చేయగలిగిన నాయకులు మాత్రమే తమ పార్టీలో చేరాలని,  లేకపోతే అవసరం లేదని చెప్పారు.

అంతేకాదు తనకు నాయకులు ముఖ్యం కాదని,  కార్యకర్తలే ముఖ్యమని , జనం లోనూ స్పష్టమైన మార్పు రావాలని పవన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

  కొంతమంది నాయకులు తన పార్టీలో చేరి ఆ తరువాత ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని,  అటువంటి నాయకులు జనసేనకు అవసరం లేదని, అనవసరమైన నేతలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో ఇతర పార్టీలలో సరైన ప్రాధాన్యం దక్కని వారు జనసేన కు క్యూ కడదామని చూస్తున్న, పవన్ స్టేట్మెంట్లు ఇబ్బందికరంగా మారాయి.

ఇది ఇలా ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒకరు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారని, ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతూనే వస్తోంది.

"""/"/ అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తాను జనసేనలోకి రావాలని అనుకుంటున్నానని రాయబారం పంపించినా, పవన్ నుంచి మాత్రం రియాక్షన్ లేదట  వీరే కాకుండా గోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు,  ఓ మాజీ మంత్రి జనసేన లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే పవన్ మాత్రం వలస నాయకులను చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు.ఇక్కడ కూడా సరైన ప్రాధాన్యం వారికి దక్కక పోయినా, పార్టీ అధికారంలోకి రాకపోయినా వెంటనే వారు తమ పార్టీ నుంచి వేరే పార్టీ లోకి వెళ్లి పోతారు అని ఇటువంటి వారిని చేర్చుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదు అనే అభిప్రాయంతో ఉన్నారట.

అందుకే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధమైన పవన్ మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చాడట.

రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!