అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి పై పవన్ ఎమోషనల్ పోస్ట్..!!

రేపు ఆగస్టు 22వ తారీకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు( Megastar Chiranjeevi Birthday ) కావటంతో మెగా అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).

సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు."అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది.

"""/"/ మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం.

కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం.

చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి.

ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హ్యాపీ బర్త్ డే అన్నయ్య"( Happy Birthday Annayya ) అని పవన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

వీడియో: సింగపూర్‌ టూరిస్ట్‌ని దారుణంగా మోసం చేసిన రిక్షా పుల్లర్‌..