పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదు..: పురంధేశ్వరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.

తమ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని తెలిపారు.జనసేన బీజేపీతో పొత్తులోనే ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

ఏపీలో పరిస్థితులను తమ పార్టీ పెద్దల దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్తామన్నారన్నారని తెలిపారు.

చర్చలు జరిగిన సమయంలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని చెప్పారు.చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని బీజేపీ తప్పుబట్టిందని వెల్లడించారు.

అరెస్టును ఖండిస్తున్నామని తామే ముందుగా తెలిపామన్న పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనేది అవాస్తవమని వెల్లడించారు.

అప్పుడు రజనీ ఫ్యాన్.. ఇప్పుడు రజనీనే మెచ్చుకున్నాడు.. ప్రభాస్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!