తెలంగాణలో పవన్ ప్రచారం..ఇవాళ మూడు నియోజకవర్గాల్లో రోడ్ షో

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిన్న వరంగల్ లో పర్యటించిన ఆయన ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంతో పాటు సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు.

బీజేపీ -జనసేన పొత్తుల నేపథ్యంలో కమలం పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.

కాగా పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా బీజేపీ - జనసేన పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆ నోట్లను రద్దు చేయాలంటున్న చంద్రబాబు