మోసం చేయడమే పవన్ బ్రాండ్..: పోతిన మహేశ్

జనసేన పార్టీపై వైసీపీ నేత పోతిన మహేశ్ ( Pothina Mahesh )కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు అరెస్ట్ కావడానికి ముందు పవన్ కల్యాణ్ ఆస్తులు ఎంత? చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక పవన్ ఆస్తులు ఎంతో బయటపెట్టాలని పోతిన మహేశ్ తెలిపారు.

ఏపీ, తెలంగాణ( AP, Telangana )లో ఎక్కడ ఎన్ని ఆస్తులున్నాయో వివరాలను బహిర్గతం చేయాలన్నారు.

దాంతోపాటుగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలను జనసేనకు చెప్పాలని పేర్కొన్నారు.

కౌలు రైతులు బలవన్మరణం చేసుకుంటే ఆదుకుంటామన్నారన్న పోతిన మహేశ్ 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు జనసేన కార్యకర్తలు విరాళాలు సేకరించారని తెలిపారు.

"""/" / ఆ నిధుల్లో రైతు కుటుంబాలకు ఎంత ఇచ్చారని ప్రశ్నించారు.

పవన్ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నానని చెబుతున్నారు.అయితే సేకరించిన నిధులు, విరాళాలు ఎటు వెళ్తున్నాయో చెప్పాలన్నారు.

పవన్ మీద దిల్ రాజు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‎మెంట్‏లో ఫిర్యాదు చేశారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )ఎంతమందిని ప్రోత్సహించారన్న పోతిన మహేశ్ మాటలు చెప్పడం.

మోసం చేయడమే పవన్ బ్రాండ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..