టిడిపికి ఇబ్బందిగా మారుతున్న పవన్ దూకుడు?
TeluguStop.com
తన వారాహి యాత్ర( Varahi Yatra )ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ( JanaSena Party ) కి ఒక ఊపు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ తన యాత్ర ల ద్వారా అధికార పార్టీపై తన దైన శైలి లో చెలరేగడం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి అంతులేని ఆనందం కలిగించిందని తెలుగుదేశం అనుకూల మీడియాలో పవన్ కు లభించిన కవరేజ్ బట్టి అర్థమవుతుంది.
జగన్( CM Jagan ) ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అవినీతి చిట్టాలను పాయింట్ టు పాయింట్ డాక్యుమెంటడ్ ఎవిడెన్స్ తో పవన్ నిలదీయడంతో ప్రజల్లో ఇదంతా చర్చకు వచ్చేలా టిడిపి అనుకూలమీడియా ఆ మాటలకు విపరీత ప్రచారం కల్పించింది.
అంతేకాకుండా పవన్ పై వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాడి చేయాలని చూసి అధికారపక్ష దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ఈ మీడియానే పవన్ కు సహాయపడింది .
పవన్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేసింది. """/" / ఇదంతా అంతిమంగా తెలుగు దేశానికి రాజకీయంగా మేలు కలుగుతుంది అని కలగాలనే ఉద్దేశంతోనే మీడియా చేసినప్పటికీ ఇందులో అనుకోకుండా పవన్ కళ్యాణ్ కి కూడా చాలా మైలేజ్ దక్కింది.
పవన్ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఉవ్వెత్తున ని ఎగిసిపడుతుందని అయితే అంతిమంగా ఆ వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని లెక్కలేసుకుంటున్న తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు జనసేన పార్టీ స్వీయ నిర్మాణం దిశగా వేగంగా ముందుకు వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది.
పొత్తు ఇంకా ఫైనల్ కాకుండానే నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను ప్రకటిస్తున్న పవన్ దూకుడు తెలుగుదేశం వర్గాల్లో చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.
"""/" / సాధ్యమైనంత తొందరగా పొత్తు విషయాన్ని ఫైనల్ చేసుకోకపోతే ఇది పెద్ద పీటమడి గా మారి ఎన్నికల సమయం లో రెబల్ అభ్యర్థులు విజృంబించడానికి అవకాశం ఇస్తుందని భావిస్తున్న తెలుగుదేశం వ్యూహ నిపుణులు పొత్తుపై పవన్ ను తొందర పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.
మరొక పక్క ఢిల్లీ తో నిరంతరం టచ్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ బిజెపి( BJP Party ) వ్యూహాలను కూడా వంట పట్టించుకుంటే పొత్తు మరింత క్లిష్టమవుతుందని భావిస్తున్న తెలుగుదేశం నేతలు సాధ్యమైనంత తొందరగా పొత్తు ఫైనల్ చేసుకోవాలని చూస్తున్నారట.
ఎలక్ట్రిక్ పోల్ మీదే మాడిమసైన లైన్ మ్యాన్.. వీడియో వైరల్