మరోసారి పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఏప్రిల్ లో వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ట్రెండ్ సృష్టించింది.

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత కాలం నుంచో ఆయన్ని మరల తెరపై చూడాలని కోరుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు.ఎంతో కాలం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించాలని అనుకుంటున్న తమన్ కి వకీల్ సాబ్ తో ఆ కల నెరవేరింది.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం అప్పుడప్పుడు గొంత సవరించుకొని గాయకుడుగా మారిపోతాడు.

గతంలో చాలా సినిమాలకి పాటలు పాడాడు.అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో సంగీత దర్శకులు పవన్ తో ఓ బిట్ సాంగ్ అయినా పాడించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా పవన్ తో ఓ పాట పాడించడానికి రెడీ అయ్యాడు.

వకీల్ సాబ్ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలోనే పవన్ ఓ సాంగ్ ఆలపించబోతున్నట్లు థమన్ వెల్లడించారు.