వ్యక్తిగత విషయాల జోలికి వస్తే ఊరుకోను హెచ్చరించిన పవన్..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేపట్టిన వారాహి విజయ యాత్ర( Varahi Victory Yatra ) తొలి దశ నేటితో ముగిసింది.

ఈరోజు సాయంత్రం భీమవరంలో జరిగిన బహిరంగ సభలో తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

వ్యక్తిగత విషయాల్లో జోలికొస్తే వదిలే ప్రసక్తి లేదంటూ ముఖ్యమంత్రి జగన్( Jagan ) ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"జగన్ చెవులు రిక్కించి విను.నీ వ్యక్తిగత జీవితం క్షణం క్షణం నాకు తెలుసు.

నా వ్యక్తిగత జీవితాల గురించి, పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఉండను.ఇది వార్నింగ్ అనుకో.

బలమైన పోరాటం ఇవ్వబోతున్న.నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే రక్తం వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఇదే సమయంలో శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డినీ కూడా టార్గెట్ చేయటం జరిగింది.

దేవుడి సొమ్ము తిన్న వారు ఎవరైనా నాశనం అయిపోతారు.తరాలు లేచిపోతాయి.

జాగ్రత్త వైవి సుబ్బారెడ్డి గారు అంటూ హెచ్చరించారు.శ్రీవాణి ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగింది నిజం కాదా.

?, ఆలయ నిర్మాణాల కోసం కాంట్రాక్టులు ఎవరిచ్చారు.? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడా లేడా.? అని నిలదీశారు.

వైసీపీ అధికారంలోకి రాగానే తప్పు చేసిన ప్రతి వైసీపీ నాయకుడి పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు.

ఆ సినిమా చేయనని డైరెక్టర్ కు షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?