దేవుడు కనిపించి వరమడిగితే పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్

బండ్ల గణేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పలు సినిమాల్లో నటుడిగా నటిస్తూనే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇన్నిరోజులు నటుడిగా పలు సినిమాలలో నటించిన బండ్ల గణేష్ డేగల బాబ్జి సినిమా ద్వారా హీరోగా సందడి చేయనున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ తో పాటు దర్శకుడు వెంకట్ చంద్ర, నటుడు సమీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సుమ వారిపై పంచులు వేయడం వారు కూడా సుమకు పంచ్ లు వేస్తూ సందడి చేశారు.

"""/"/ ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తూ మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై వరం కావాలంటే మీ గురించి అడుగుతారా.

పవన్ కళ్యాణ్ గురించి కోరుకుంటారా అని ప్రశ్నించగా తాను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఆ తర్వాత నేను కూడా బాగుండాలని కోరుకుంటాను అంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అదేవిధంగా కరోనా సమయంలో తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాన్ని కూడా ఈ కార్యక్రమంలో బండ్లగణేష్ తెలియజేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేటితో ముగియనున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!