నేటి నుంచే పవన్ ఉత్తరాంధ్ర టూర్ ! షెడ్యూల్ ఇలా
TeluguStop.com
విశాఖ కేంద్రంగా రాజకీయ కల్లోలం నేటి నుంచి మొదలు కానుంది.ఇప్పటికే మూడు రాజధానులకు వ్యతిరేకంగా , అమరావతికి మద్దతుగా ఆ ప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్రను చేపడుతుండగా, దానిని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ గర్జన ను ఏర్పాటు చేశారు.
ఇక ఇదే సమయంలో నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటన చేయనున్నారు.
జనవాణి కార్యక్రమం పేరుతో పవన్ పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు.ఈ మేరకు నేడు విశాఖలో అడుగుపెట్టనున్నారు.
అయితే పవన్ యాత్రపై వైసిపి అనేక విమర్శలు చేస్తోంది.చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ వైసీపీ గర్జనను డైవర్ట్ చేసేందుకు ఉత్తరాంధ్ర యాత్ర ను ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు చేస్తున్నారు.
దీనిపై విమర్శలు , ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ఇది ఇలా ఉంటే పవన్ పర్యటన ఉత్తరాంధ్రలో ఈ విధంగా సాగబోతోంది.
ఈ రోజు మధ్యాహ్నం పవన్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.అక్కడి నుంచి ఎన్ఏడి ఫ్లై ఓవర్ , సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదుగా నోవా టెల్ హోటల్ కి చేరుకోనున్నారు.
సాయంత్రం విశాఖ జిల్లాకు చెందిన కీలక నాయకులతో పవన్ సమావేశం కానున్నారు.రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దీనిలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి, వాళ్ల సమస్యల గురించిన వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
ఆ రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. """/"/
ఈ సమావేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి ? జనసేన ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే జనసేన అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహా పాదయాత్రకు మద్దతు ప్రకటించింది.
జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బిజెపి సైతం ఈ మహా పాదయాత్రలో పాల్గొంటుంది అయితే బిజెపి జనసేన టిడిపిలో అమరావతి ని మాత్రమే లెక్కల్లోకి తీసుకుంటున్నారని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందనం వారికి ఇష్టం లేదు అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్న క్రమంలో ఆ ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా, అనేక చర్యలు చేపట్టాయి.
దీనిలో భాగంగానే ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?