చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం..: సజ్జల
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తాపత్రయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )అన్నారు.
కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.కూటమిలో అంతా చంద్రబాబు మనుషులేనని సజ్జల పేర్కొన్నారు.
జనసేనకు చంద్రబాబు ఇచ్చింది 21 సీట్లేనన్న ఆయన వాటిలోనూ చంద్రబాబు( Chandrababu ) మనుషులే ఉన్నారని చెప్పారు.
2014 లో ఇదే కూటమి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారన్న సజ్జల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.