పవన్ బీజేపీని కాదని బయటకు రావాలి..: ఎమ్మెల్యే ద్వారంపూడి
TeluguStop.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


పవన్ కల్యాణ్ బీజేపీని కాదని బయటకు రావాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.


అప్పుడే పవన్ ప్యాకేజీ సొమ్ము ఎలా విదేశాలకు వెళ్లాయో బయటకు వస్తాయని చెప్పారు.
తనకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటిందని ఆరోపించారు.
ఈ క్రమంలో జనసేనాని బీజేపీ నుంచి బయటకు వస్తే హవాల డబ్బు ఏ దేశానికి వెళ్లిందో తేలుతుందని వెల్లడించారు.
అయితే ఏపీలో జనసేన ప్రస్తుతం బీజేపీతో పాటు టీడీపీతోనూ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
మరోసారి అలా కనిపించబోతున్న రామ్ చరణ్.. సుకుమార్ మ్యాజిక్ చేయడం పక్కా!