వైసీపీ మహమ్మారికి టీడీపీ-జనసేన ఒక వ్యాక్సిన్ పవన్ సంచలన కామెంట్స్..!!

నేడు నాలుగో విడత వారాహి విజయ యాత్ర ( Varahi Vijaya Yatra )కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించడం జరిగింది.

యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర శ్రేయస్సు కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.తాను కాపు కులం కాబట్టి కాపు కులస్తులతో తిట్టించటం చూస్తుంటే జగన్ పిల్ల చేష్టలు చేస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు.

తాను వ్యక్తిని చూస్తాను తప్ప కులాన్ని చూడనని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరిలో గుణమే చూశానని చెప్పుకొచ్చారు.

కులం చూసి తాను ఎవరిని దగ్గరకు తీసుకోనని.కీలకమైన పదవులను ఒకే కులం వారితో నింపకుండా చూసుకుంటానని పవన్ వ్యాఖ్యానించారు.

నా తండ్రి కమ్యూనిస్టు.కులం కంటే మానవత్వమే గొప్పదని భావిస్తా.

గుణం చూసి స్నేహం చేస్తా తప్ప.కులం వల్ల మనిషిని దగ్గరకు తీసుకోను.

రాష్ట్రాన్ని పట్టిపీడిస్తు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ( Janasena-TDP ) కూటమి విజయమే వ్యాక్సిన్ అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి జగన్ కు 175 కాదు.15 సీట్లు వస్తే గొప్ప.

వైసీపీ ఫ్యాన్ కి కరెంటు ఎప్పుడు ఆగుతుందో తెలియదు.గొంతు దాహం తీర్చే జనసేన గ్లాస్, నేలను అంటిపెట్టుకొని ఉండే సైకిల్ ఏపీ ప్రయోజనం కోసం కలుస్తున్నాయి.

వైసీపీ ఫ్యాన్ ను పీకేద్దాం అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సెట్ చేయబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…