పవన్ సినిమా ఆగష్టులో రిలీజ్.. సాధ్యమయ్యే పనేనా..?

సెట్స్ మీద ఒక సినిమా.చేయాల్సిన సినిమాలు మరో రెండు లైన్ లో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తమిళ సినిమా వినోదయ సీతం రీమేక్ ని ఫిక్స్ చేసిన పవన్ రీసెంట్ గా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఈ సినిమాలో పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా నటించాడు.

సినిమాలో పవన్ మరోసారి దేవుడు గా కనిపించనున్నారు.తమిళ్ లో ఆ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో డైరెక్షన్ చేస్తున్నారు.

"""/"/ ఇదిలాఉంటే ఈ సినిమాకు పవన్ కేవలం 20 రోజులు డేట్స్ మాత్రమే ఇచ్చాడని తెలుస్తుంది.

సినిమాలో ఎక్కువగా సాయి తేజ్ రోల్ ఉంటుందని టాక్.అయితే సినిమాను పర్ఫెక్ట్ గా షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని టాక్.మొత్తానికి మార్చిలో సెట్స్ మీదకు వెళ్లి ఆగష్టులో రిలీజ్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

వైరల్ వీడియో: భూమి నుండి10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడుతున్న నీరు