తిరుపతి ప్రచారానికి పవన్ రెడీ ! షెడ్యూల్ ఇదే

పోటీ చేస్తున్నాము అన్న సంతోషం తప్ప , తిరుపతిలో గెలుస్తామా లేదా అనే సవాలక్ష సందేహాలు ఏపీ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి.

తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ ఎన్నికలలో తమకు సహకరిస్తుందా లేదా అనేది కూడా ఆ పార్టీ నేతలకు అనుమానంగానే ఉంటూ వచ్చింది.

దీనికి కారణం తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని చూడడమే.కానీ బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని ప్రకటించడం, దీనికి పవన్ మద్దతు ఇవ్వాల్సి రావడంతో పవన్ ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ నేతలు గ్రహించారు.

అందుకే పదేపదే పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.ఇప్పటివరకు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ వస్తారా ? బిజెపి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా అనేది సందేహంగా ఉంటూ వచ్చింది.

ఎట్టి  పరిస్థితుల్లోనూ పవన్ ఎన్నికల ప్రచారానికి రారు అని, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కు ఓటు వేయాలని సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

దీంతో బీజేపీ ఏపీ నేతల్లో టెన్షన్ మరింత పెరుగుతూ వచ్చింది.బీజేపీ అగ్రనేతలు సైతం తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో, పవన్ కనుక ఈ ఎన్నికల ప్రచారానికి రాకపోతే, బీజేపీ తిరుపతి లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్న జనసేన పార్టీ మద్దతు లేకపోతే గెలవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన బిజెపి నేతలు పవన్ ప్రచారానికి రావాల్సిందిగా ఒత్తిడి చేయడంతో,  ఎట్టకేలకు పవన్ తిరుపతిలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు.

"""/" / ఏప్రిల్ 3వ తేదీన పవన్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కు మద్దతుగా తిరుపతి నగరంలోని ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐ ఆర్ బైపాస్ మీదుగా, శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేపడతారని ప్రకటించడంతో బీజేపీలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.

పవన్ పర్యటన ద్వారా తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మంచి ఊపు వస్తుంది అని, జనసేన నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ కి మద్దతుగా ఎన్నికల ప్చారం నిర్వహిస్తారని బీజేపీ అభిప్రాయపడుతోంది.

దిశా కేసులో సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై టీఎస్ హైకోర్టు స్టే