విశాఖలో అరెస్టైన పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ..!
TeluguStop.com
విశాఖలో ఇటీవల అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం అవుతారు.ఈ నేపథ్యంలో సమావేశానికి అందుబాటులో ఉన్న నేతలు అందరూ హాజరు కావాలని పవన్ ఆదేశించారు.
కాగా ఈ భేటీలో రేపటి పీఏసీ సమావేశ అజెండాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేపు ఉదయం 10 గంటలకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.
దీనిలో కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించడంతో పాటు పొత్తుల అంశంపై నేతలకు పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు.
వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు చెల్లిని చూశారా.. అచ్చం ఆమెలానే ఉందంటూ?