కంట్రోల్ తప్పిన పవన్ ..? తొందరపాటేనా? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఎప్పుడూ  కనిపించినంత ఫైర్ నిన్న కనిపించింది.

విశాఖలో పవన్ పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం,  జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం,  కోర్టు వారికి రిమాండ్ విధించడం,  తదితర పరిణామాల తర్వాత నిన్న మీడియా సమావేశంలో పవన్ వైసీపీ మంత్రులు ఇతర నాయకులపై సంచలన విమర్శలు చేశారు.

ఈ క్రమంలో పవన్ నోరు జారారు.  బూతులతో విరుచుకుపడ్డారు.

పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారగా జనసేన నాయకులు, పవన్  సినీ అభిమానుల్లో కలకలం సృష్టించాయి.

తమ ఆరాధ్య దైవంగా భావిస్తున్న పవన్ నోటి వెంట బ్యాలెన్స్ తప్పిన మాటలు అందరిని ఆశ్చర్యపరిచాయి.

    అయితే ఒక పార్టీ అధినేతగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్న సినీ హీరోగా పవన్ పరిపక్వతతో మాట్లాడి ఉంటే హుందాగా ఉండేది.

కానీ పవన్ వైసీపీ , ఆ పార్టీ నాయకులపై ఉన్న ఆగ్రహాన్ని తన నోటి ద్వారా చూపించారు.

వైసీపీ నేతలు రెచ్చగొట్టబట్టే పవన్ వ్యక్తిగత దూషణలకు దిగినా.పవన్ అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఈ విధంగా నోరు జారడం,  బ్యాలెన్స్ తప్పి ఘాటు పదజాలంతో విమర్శలు చేయడం వంటివి అంతిమంగా జనసేనకు నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  ఇప్పటికే వైసిపి మంత్రులు కొందరు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఇదే విధమైన అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

వారిపై ఆగ్రహం అసంతృప్తి కలుగుతుంది కానీ,  పవన్ అంతటి చరిష్మా ఉన్న వ్యక్తి వైసీపీ ట్రాప్ లో పడి తన ఇమేజ్ ను తగ్గించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  """/"/   పవన్ కు వైసీపీ పైవన్న ఆగ్రహాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో తన చెప్పులు చూపించి మరి తిట్టిపోశారు.

కేడర్ కూడా తిరగబడాలని, చర్చల్లోనూ పాల్గొనాలని,  ఏదైనా ఎక్కువ మాట్లాడితే వెంటనే చెప్పు తీసుకుని కొట్టాలంటూ అభిమానులకు , జన సైనికులకు పిలుపునివ్వడం కచ్చితంగా పవన్ తొందరపాటు నిర్ణయమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హమ్మయ్య .. మొత్తానికి దివాళీ ఎపిసోడ్ తో చిందులు వేయించారు