పవన్ , లోకేష్ , బాలయ్య ! నేడు బాబుతో ములాఖాత్
TeluguStop.com
ఏపీలో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతోంది .స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెంటర్ జైలులో ఉన్నారు.
ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది.ఇక బెయిల్ ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో , టిడిపి కూడా తీవ్ర నిరాశలో ఉంది.
ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ( Skill Development Scam )తో పాటు, మరిన్ని స్కీములను వెలుగులోకి తెచ్చి చంద్రబాబును బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నాల్లో వైసిపి ప్రభుత్వం నిమగ్నం అవ్వగా, చంద్రబాబుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.
ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ), హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ములాఖాత్ కానున్నారు .
రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈ ముగ్గురు నేతలు వెళ్ళనున్నారు. """/" /
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
దాదాపు 40 నిమిషాల పాటు వీరు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు.దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా భద్రత ఏర్పాట్లను చేశారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్ బాలకృష్ణ రాజమండ్రి కి చేరుకోబోతున్నారు.
చంద్రబాబును కలిసిన తర్వాత ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించబోతున్నారు.
ఇక చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఏ అంశాలపై మాట్లాడాలి అనే అంశం పైన ముందుగానే చర్చించనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ను అరెస్టు చేసిన సమయంలోనే ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు.
కానీ ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ సైలెంట్ అయ్యారు.ఇప్పుడు కేంద్ర కార్యాలయంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కు అనుమతి లభించడంతో పవన్ ఏ అంశాలపై చంద్రబాబుతో మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
"""/" /
ప్రస్తుతం పవన్ బిజెపితో పొత్తులో( Pawan Kalyan ) ఉన్నారు.
చంద్రబాబు అరెస్టుపై బీజేపీ స్పందించడం లేదు .ఈ అరెస్టు వ్యవహారంలో కేంద్రం పాత్ర కూడా ఉందనే అనుమానాలు టిడిపి శిబిరంలో ఉండగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ టిడిపికి మద్దతుగా నిలబడడం , స్వయంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తుండడంపై బీజేపీ కూడా ఆసక్తిగా పరిస్థితులను గమనిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాయనే నమ్మకంతో పవన్ ఉండగా , బిజెపిని మాత్రం టిడిపి విషయంలో సానుకూలంగా లేదు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి ,జనసేన కలిసి పోటీ చేసే ప్రతిపాదన తెరపైకి వస్తుందనే ఆసక్తి రెండు పార్టీల నేతల్లో కలుగుతోంది.
అవసరమైతే బీజేపీతో తెగ తెంపులు చేసుకుని టిడిపి తో జత కట్టేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లుగా టిడిపి అంచనా వేస్తోంది.
వీడియో: జాబ్ మానేస్తున్నానన్న ఉద్యోగిని.. మేనేజర్ ఊహించని రియాక్షన్ వైరల్..!