‘బ్రో’లో ట్రీట్ మాములుగా ఉండదట.. వింటేజ్ పవన్ సాంగ్స్ అన్ని రీమిక్స్!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న క్రేజీ సినిమాల్లో 'బ్రో'( Bro Movie ) ఒకటి.
ఈ సినిమాలో ఈయన రోల్ ఫుల్ లెంన్త్ రోల్ పోషించక పోయినప్పటికీ ఈ సినిమా పై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఎందుకంటే ఈయన ఉండే కొద్దిసేపు ఈ సినిమా హై లెవల్లో ఉంటుందని.ఆయనపై మంచి సర్ప్రైజ్ లు ప్లాన్ చేసారని టాక్ ఇప్పటికే వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరింత ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న బ్రో సినిమాను సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు.
ఈయన తమిళ్ లో నటించి తెరకెక్కించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా ఇక్కడ కూడా ఆయనే తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.దీంతో తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు.
"""/" /
ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ బాగా ఆకట్టు కున్నాయి.అందుకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఈ రోజు టీజర్ రాబోతున్న సంగతి తెలిసిందే. """/" /
సాయంత్రం టీజర్ రిలీజ్ చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ నిన్న రిలీజ్ చేయగా అదిరిపోయింది.చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో తమ్ముడు సినిమా గెటప్ లో కనిపించి కేక పెట్టించాడు.
అయితే ఈ సినిమాలో గుడుంబా శంకర్ సినిమా లోని కిల్లి కిల్లి సాంగ్ రీమిక్స్ ఉంటుంది అని టాక్ రాగ ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు పవన్ వింటేజ్ హిట్స్ అయిన వయ్యారి భామ, ఏదోలా ఉందీవేళ, సరిగమ పదనిస వంటి సాంగ్స్ ను కలిసి థమన్ మిక్స్ చేసినట్టు టాక్ వస్తుంది.
దీంతో పవన్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఈసారి మాములుగా ఉండదని అనిపిస్తుంది.
కెనడాపై అమెరికా పన్నులు పెంపు.. భారతీయ విద్యార్ధులపై ప్రభావం