వింటేజ్ లుక్స్ తో పవన్.. ‘ఓజి’లో అదరగొట్టడం ఖాయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )లైనప్ లో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.

వాటిల్లో 'ఓజి'( OG Movie ) కూడా ఒకటి.ఈ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.

అలా ప్రకటించిన కొద్దీ రోజులకే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు జరుపుకుంది.

ఇక ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Sujith ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఇక హైదరాబాద్ లో జరుపు కుంటున్న ఈ సినిమా ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

"""/" / వీటిల్లో పవన్ స్టైలిష్ గా మాత్రమే కాదు వింటేజ్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఇంకా లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.

ఈ లుక్స్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను వింటేజ్ లుక్స్ లో చూడబోతున్నాం అని ఎగ్జైట్ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

"""/" / వీటితో పాటు పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు వినోదయ సీతం రీమేక్ బ్రో సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.వీటిలో రీమేక్ మూవీ బ్రో జులైలో రిలీజ్ కాబోతుంది.

ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?