అప్పుడే వకీల్ సాబ్ పైరసీ... టెన్షన్ లో చిత్ర యూనిట్

ఈ మధ్యకాలంలో సినిమాపై పైరసీ మాఫియా విపరీతంగా ప్రభావం చూపిస్తుంది.సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికి ఆ చిత్రం పైరసీ వీడియో నెట్ లోకి వచ్చేస్తుంది.

ఈ పైరసీ కొన్ని సినిమాల బిజినెస్ పెరగడానికి కారణం అయితే మరికొన్ని సినిమాలు పూర్తిగా డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలకి కారణం అవుతుంది.

ఈ పైరసీ మాటున ప్రతి ఏడాది వందల కోట్ల మేరకు సినిమాలకి నష్టం జరుగుతుంది.

అయితే దీనిని కంట్రోల్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన వర్క్ అవుట్ అవ్వడం లేదనే చెప్పాలి.

చట్టాన్ని ఉపయోగించుకొని పైరసీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన అది మున్నాళ్ళ ముచ్చటే అవుతుంది.

పైరసీ చేసిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన మళ్ళీ వారు బెయిల్ మీద బయటకి వచ్చి యధావిధిగా కొత్త సినిమాలు పైరసీ చేస్తున్నారు.

ఈ పైరసీ కారణంగా చిన్న సినిమాలు భాగా దెబ్బ తింటున్నాయి.ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే డివైడ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్స్ పూర్తిగా పడిపోతున్నాయి.

తాజాగా నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మొదటి ఆట కూడా పడకుండానే పైరసీ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకి పైరసీ ఎఫెక్ట్ తప్పలేదు.

సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికె నెట్ లో పైరసీ వీడియో ఫ్రింట్ అందుబాటులోకి వచ్చేసింది.

ఈ పైరసీ అంతా యూఎస్ నుంచి జరగడంతో దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.గతంలో అత్తారింటికి దారేది సినిమాకి కూడా ఇలాగే రిలీజ్ కి ముందే సినిమా పైరసీ రూపంలో బయటకొచ్చేసింది.

అయితే ఆ పైరసీ అనేది సినిమా కలెక్షన్ పెరగడానికి కారణం అయింది.అయితే ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో పైరసీ కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అసలే రాజకీయంగా పవన్ ప్రయాణం సాగిస్తున్న నేపధ్యంలో ప్రత్యర్ధి పార్టీలు అతని సినిమా కలెక్షన్స్ ప్రభావితం చేసే విధంగా పైరసీ వీడియోలని ఎక్కువగా షేర్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

కొడుకు చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన నమ్రత.. అచ్చం మహేష్ లా ఉన్నాడంటూ?