ఎన్నికల యుద్ధానికి రెడీ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.

ఎట్టి పరిస్థితుల్లో వైసీపీనీ గెలవనిచ్చే ప్రసక్తే లేదని చాలా సందర్భాలలో తెలియజేశారు.ఈ క్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గాల నాయకులతో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయటానికి రెడీ కావటం తెలిసిందే.

దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు.కానీ తర్వాత బస్సు యాత్ర పోస్ట్ పోన్ చేసుకుని తాజాగా.

యాత్రకు సిద్ధమవుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.మేటర్ లోకి వెళ్తే ఎన్నికల యుద్ధానికి "వారాహి" సిద్ధమంటూ.

ప్రత్యేకంగా తన యాత్రకి సంబంధించి చేయించుకున్న ఆర్మీ ట్రక్కుతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.

దాదాపు మూడు నెలలు శ్రమించి ఈ ఆర్మీ ట్రక్కును డిజైన్ చేశారు.బస్సుతో పవన్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి కి వస్తున్నాం మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..?